శ్రీ శోభకృత్ నామ సం|॥ చైత్ర ఐ॥ విదియ ఉ.6.25 అనూరాధ రా.2.17 ఉ.శే.వ.7.07కు ఉ. దు. 8.22 ల 9.11 ప. దు. 12.27 ల 1.16.
మేషం :- ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరచుకుంటారు. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది.
వృషభం :- ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.
మిథునం :- కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. మీ సంతానం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
కర్కాటకం :- రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి యోగదాయకం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వ్యాణిజ్య వ్యాపార రంగాలవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఖాదీ, చేనేత, కలంకారీ, నూలు వస్త్ర వ్యాపారులు లాభసాటిగా ఉంటాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
సింహం :- తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. వస్తువులు పోవడానికి ఆస్కారం ఉంది. అలౌకిక విషయాల పట్ల ఇష్టం పెరుగుతుంది.
కన్య :- కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సహకరం. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనా లోపం. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికమతాయి.
తుల :- ఆర్థిక లావాదేవీలు, స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభిస్తారు. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది.
వృశ్చికం :- మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. నమ్మినవారే మోసం చేయుదురు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలసివచ్చే కాలం.
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. ట్రాన్స్పోపోర్టు, ఆటోమొబైల్, మెకానిక్ రంగాలవారికి అనుకూలం. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది.
మకరం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. కొంత మంది మీ నుండి ధన సహాయం కోరవచ్చు. పారిశ్రామిక, కార్మికులలో నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
కుంభం :- వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించండి. వృత్తి వ్యాపార రంగాలల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు.
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు. రుణ ఒత్తిడి, రావలసిన ధనం అందకపోవటం వల్ల ఒకింత ఆందోళనతప్పదు.