Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-08-2024 ఆదివారం దినఫలాలు - ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది....

రామన్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ ఐ|| షష్ఠి ఉ.10.46 భరణి రా.10.38 ఉ.వ.9.05 ల 10.35. సా.దు. 4.46 ల 5.37.
 
మేషం :- మీ గృహ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ప్రోత్సాహం లభించగలదు. ఎదుటివారితో ఆచితూచి సంభాషించండి. దంపతుల మధ్య ఏకీభావం కుదురును. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆశించినంత పురోగతి ఉండదు. విద్యార్ధులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- ప్రింటింగు, స్టేషనరీ రంగాలలోవారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారులతో మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికస్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవటంతో ఒకింత నిరుత్సాహంతప్పదు.
 
మిథునం :- కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. నూతన అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది.
 
సింహం :- వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు కలిసిరాగలదు. కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు చికాకు తప్పదు. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారం కలదు. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లుగానే ఉంటాయి. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య :- ఆధికారులతో ఏకీభావం కుదరదు. ఎదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
తుల :- ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికవుతుంది. రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్నేహ బృందాలు అధికమవుతాయి.
 
వృశ్చికం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
ధనస్సు :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
 
మకరం :- ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయలో సంతృప్తి కానరాగలదు. కుటుంబీకుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమసిపోగలవు. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో మెళుకువ వహించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రోజుకోక వాహనంపై కనువిందు చేస్తున్న మలయప్ప స్వామి

Astrology 27-08-2025: శనివారం మీ రాశి ఫలితాలు.. రుణ ఒత్తిడి తొలగుతుంది

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments