Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-11-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా....

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (05:00 IST)
మేషం : వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో వ్యవహరించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం : ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అధికారుల ప్రశఁసలు పొందుతారు. ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి. మొక్కుబడులు తీర్చుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు చేతి పనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాలు పట్ల ఆసక్తి పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహకరం. కొంతమంది మీ ఆలోచలు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో చికాకు తప్పవు. 
 
సింహం : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులలో ఇంటర్వ్యూలో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు మెలకువ అవసరం. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. దంపతుల మధ్య పట్టింపులు, కలహాలు చోటు చేసుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి శ్రమాధిక్యత తప్పవు. 
 
కన్య : ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా సాగుతాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాల సహకరిస్తారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం ప్రదర్శించండి. ఇతరుల మాట లెక్క చేయక అడుగు ముందుకేసి శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. 
 
తుల : భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు  స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు అవసరం. 
 
వృశ్చికం : ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. 
 
ధనస్సు : రుణం, వాయిదాల చెల్లింపులు అనుకూలిస్తాయి. మీ సంతానం ఆరోగ్యం, వివాహ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యతేగానీ, ఆశించిన ప్రతిఫలం పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. 
 
మకరం : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టర్లకు, పరిశ్రమలకు అవసరమైన లైసెన్సులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఏకాగ్రత చాలా ముఖ్యం. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించడానికి మరికొంత కాలంపడుతుంది. 
 
కుంభం : భాగస్వామిక వ్యాపారుల, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థినుల ఆలోచనలు తప్పుదారి పట్టే ఆస్కారం ఉంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులలో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం : కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యంకాదు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహ పరుస్తాయి. స్థిరాస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగవులు పరిష్కారమవుతాయి. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments