వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (16:05 IST)
వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు.
 
సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు.
 
నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. కొంతమంది నాయకులు తమ అనుచరులను వైసీపీ రెబెల్స్‌గా పోటీకి నిలబెట్టి పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
రెబెల్స్‌ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని ఆమె పేర్కొన్నారు. మంత్రి పెద్దరెడ్డిని ఉద్దేశించే రోజా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments