Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో టీటీపీ అక్రమాలపై కాగ్‌తో ఆడిట్ చేయించాలి : డాక్టర్ స్వామి

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (15:50 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఆడిట్ చేయించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. 
 
గత ఐదేళ్లకు సంబంధించిన టీటీడీ అకౌంట్లను కాగ్ తో ఆడిట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుందని చెప్పారు. టీటీడీపై ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా చేస్తానని అన్నారు.
 
గతంలో తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం లేకుండా తాను చేశానని స్వామి చెప్పారు. ఆలయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తనకు, తమిళనాడు రాష్ట్రానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని గుర్తుచేశారు. 
 
అదేవిధంగా తితిదేపై కూడా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా చేసేలా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. కాగా, మసీదులు, చర్చిలపై ప్రభుత్వాల అజమాయిషీ లేదని... ఇదే సమయంలో ప్రభుత్వాల అధీనంలో 4 లక్షల ఆలయాలు ఉన్నాయని చెప్పారు.
 
మరోవైపు, తిరుమల ఆలయంపై గత కొంత కాలంగా అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని... ఆ సంస్థపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల ఆలయంపై దుష్ప్రచారం ఎక్కువైందని అన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments