Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఆవిర్భావదినోత్సవం - దేవుని దయ - ప్రజల చల్లని దీవెనలతో...

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆవిర్భవించి 11 యేళ్లుపూర్తి చేసుకుని 12వ యేటలోగి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 
 
"దేవుని దయ, ప్రజల చల్లని దేవెనలతో నేడు 12వ యేటలోకి అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ప్రతి ఇంటా విద్యా ఆర్థిక, సమామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి" అంటూ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
తాము పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గొప్ప సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్రం అభివృద్ధితో దూసుకునిపోతుందని చెప్పారు. వైకాపా అధినేత జగన్ ఈ రాష్ట్రానికి 30 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments