Publish Date: Mon, 07 Mar 2022 (19:41 IST)
Updated Date: Mon, 07 Mar 2022 (19:54 IST)
వైకాపా అధినేక జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం పని చేసిన క్రైస్తవులంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన బామ్మర్థి, వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ అన్నారు. కాగా, ఈయన భార్య వైఎస్. షర్మిల తెలంగాణలో తన తండ్రి పేరుమీద రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి అన్నీ తానే బ్రదర్ అనిల్ పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, 2019లో ఏపీ సీఎం జగన్ కోసం పని చేసిన క్రైస్తవులు ఇపుడు తీవర ఆవేదనలో ఉన్నారన్నారు. ఇటీవలే తనతో భేటీ అయిన కొందరు క్రైస్తవులు ఇదే మాటలు తనతో చెప్పారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అదేసమయంలో తాము ఏపీ వేదికగా కొత్త పార్టీని పెట్టడం లేదన్నారు. ఈ విషయంపై సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ప్రత్యేకంగా కలవడం వెనుక ఏ విధమైన ప్రత్యేక అంశం లేదన్నారు. ఏదైనా ఉంటే మాత్రం తానే స్వయంగా వెల్లడిస్తానని బ్రదర్ అనిల్ తెలిపారు.