Publish Date: Mon, 07 Mar 2022 (19:22 IST)
Updated Date: Mon, 07 Mar 2022 (19:25 IST)
తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 30మందికి పైగా గాయాలైనాయి.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం, తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సును.. అదే మార్గంలరో వెళ్తున్న మరో బస్సు బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.