Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామాంధ బస్ డ్రైవర్, ప్రయాణికురాలిపై అత్యాచార యత్నం

కామాంధ బస్ డ్రైవర్, ప్రయాణికురాలిపై అత్యాచార యత్నం
, శుక్రవారం, 4 మార్చి 2022 (19:35 IST)
ఈమధ్య కాలంలో ప్రజారవాణా వాహనాలను ఎక్కాలంటే మహిళలు భయపడే పరిస్థితి వస్తోంది. ఇదివరకు ఆర్టీసి బస్సు ఎక్కితే తమ గమ్యస్థానం వచ్చేవరకూ హాయిగా సీట్లో నిద్రపోయి రావచ్చునుకునేవారు. కానీ ఇప్పుడు కొంతమంది కామాంధ డ్రైవర్లు తయారయ్యారు. బస్సులో మహిళా ప్రయాణికులు ఎలా తమకు ఒంటరిగా కనబడతారా అని చూస్తున్నారు. అదను కోసం చూసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడతున్నారు.

 
బుధావారం నాడు ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. నెల్లూరు నుంచి బుధవారం నాడు అర్థరాత్రి ఆర్టీసి బస్సు విజయవాడకు బయలుదేరింది. బస్సు ఒంగోలు చేరుకునేసరికి బస్సులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మిగిలారు.

 
దీనితో జనార్థన్ అనే డ్రైవర్ కామాంధ ఆలోచన వచ్చింది. డ్రైవింగ్ చేయమని మరో డ్రైవరుకు అప్పజెప్పి మహిళా ప్రయాణికురాలి పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత గుంటూరు వచ్చేసరికి మరో ప్రయాణికుడు దిగిపోయాడు. బస్సు విజయవాడకు బయలుదేరిన సమయంలో సదరు డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో వున్న మరో ప్రయాణికుడు మందలిస్తే అతడిపై దాడి చేసాడు. ఈ విషయాన్ని తన భర్తతో వెంటనే ఫోన్లో చెప్పేసరికి అతడు విజయవాడ బస్సు స్టేషన్ అధికారులను అప్రమత్తం చేసాడు. బస్సు రాగానే డ్రైవర్ జనార్థన్ ను డ్యూటీ నిలిపివేసి అతడిపై ప్రయాణికురాలు చేసిన ఆరోపణలపై విచారిస్తున్నారు.

 
యువతిని కత్తితో బెదిరించి ఇద్దరు డ్రైవర్లు అత్యాచారం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరుగగా, కూకట్‌పల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 29 యేళ్ల యువతి ఒకరు హైదరాబాద్ నగరంలో బేబీ కేరే టేకర్‌గా పని చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా నివసిస్తున్నాడు. 

 
అయితే, తన సొంతూరుకు వెళ్లేందుకు ఈ నెల 23వ తేదీన ఓ ప్రైవేటు స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కి, తనకు కేటాయించిన సీటులో నిద్రకు ఉపక్రమించింది. బస్సు కదిలిన తర్వాత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో బస్సు సూర్యాపేట దాటింది. 

 
ఈ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో రాజేష్ (35) అనే బస్సు డ్రైవర్ ఈ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మరో బస్సు డ్రైవర్ బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.7 వేల నగదును దోచుకున్నాడు. 

 
ఆ తర్వాత బాధితురాలు శనివారం హైదరాబాద్ నగరానికి చేరుకుని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరంపై శుభవార్త చెప్పిన కేంద్ర జలమంత్రి