Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:00 IST)
విజయనగరం జిల్లా గుడివాడలో కొందరు పోకిరీలు ఓ మహిళా ఎస్‌ఐను జట్టుపట్టుకుని చితకబాదారు. స్థానికంగా జరిగిన ఓ జాతరలో కొందరు పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉండే ఓ మహిళా ఎస్ఐ గుర్తించి, మందలించారు. దీంతో ఆ పోకిరీలంతా కలసి ఆ ఎస్ఐను చుట్టుముట్టి, జట్టుపట్టుకుని కొట్టడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా వేపాడు మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర మంగళవారం రాత్రి జరిగింది. దీన్ని పురస్కరించుకుని డ్యాన్స్ బేబీ డ్యాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు హంగామా చేస్తూ డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న పల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన యువకులు ఎస్ఐపై దాడి చేశారు. ఆమె జుట్టుపట్టుకుని కొట్టారు. 
 
దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమయంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని ఓ పోకిరీలు అక్కడికి వెళ్లి నానా రభస చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోకిరీల దాడిలో ఎస్ఐకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments