Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదినతో టెక్కీ అక్రమ సంబంధం... ఆ మెసేజ్ చూడగానే మరిదికి కోపం కట్టలు తెంచుకుంది.. అంతే...

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (18:04 IST)
అమాయకుడైన తన అన్న భార్య (వదిన)తో బెంగుళూరులో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని మరిది జీర్ణించుకోలేకపోయాడు. పైగా, బెంగుళూరుకు వస్తానంటే ఉద్యోగం చూసిపెడతానంటూ వదినకు టెక్కీ పంపిన మెసేజ్‌ను చూశాక మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇదే విషయాన్ని తన అన్న వద్ద చర్చించి, ఆ టెక్కీని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. తాజాగా విజయనగరం జిల్లా నెమలాం గ్రామంలో యువ ఇంజనీర్ దారుణ హత్య కేసు విచారణలో ఈ విషయం వెల్లడైంది. 
 
ఈ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే టెక్కీ అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పైగా, ఈ మె దూరపు బంధువు కూడా. ఈ క్రమంలో మహిళకు ప్రసాద్ వాట్సాప్ సందేశాలు పంపిస్తూ ఫోన్లు చేయసాగాడు. వీటిని చూసిన భర్తకు ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయాడు. అయితే, విద్యావంతుడైన మరిదికి విషయం తెలియడంతో ఆగ్రహంతో రిగిలిపోయాడు. తన అన్నతో కలిసి ప్రసాద్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. 
 
ఈ క్రమంలో పెళ్లి చూపుల కోసం ప్రసాద్ బెంగుళూరు నుంచి నెమలాంకు వచ్చి, పొరుగూరిలో ఉన్న తన తాత ఇంటికి బైకుపై ఒంటరిగా వెళ్ళడాన్ని నిందితులు గమనించారు. ఆ తర్వాత మాటువేసి కర్రతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించేందుకు ప్లాన్ చేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ప్రసాద్ తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యకు గురైనట్టు అనుమానించిన బంధువులు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంద. దీంతో హత్యకు పాల్పడిన అన్నదమ్ములను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దువ్వాడకు మాధురి ముద్దులు: ఈమెను పరిచయం చేసింది నా భార్యే అంటున్న శ్రీనివాస్