విజయనగరం జిల్లా తెర్లాం మండలం నేమలం గ్రామంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. బాధితుడు, 30 ఏళ్ల కోనం ప్రసాద్, ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ప్రసాద్‌పై దాడి చేసి హత్య చేసి, అతని మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్ హత్యకు దారితీసిన పరిస్థితులను, ఈ నేరానికి వెనుక ఉన్న కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.