Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

Advertiesment
crime

ఐవీఆర్

, మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (20:52 IST)
వారిద్దరూ ఏడెళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే ఏడేళ్ల జీవితంలో వారిద్దరి మధ్య వున్న ప్రేమ మసకబారిపోయింది. ముఖ్యంగా భార్యగా మారిన ప్రియురాలు చూపు మరో వ్యక్తిపైన ప్రేమ మొగ్గ తొడిగింది. ఫలితం వివాహేతర సంబంధం. భర్తగా మారిన పాత ప్రియుడు పాతబడి పోయాడో లేదంటే కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడో కానీ ఆమె మరో వ్యక్తి బంధంలో చిక్కుకునిపోయింది. ఇక ఆ తర్వాత ఏడేళ్లక్రితం పెళ్లాడిన పాత ప్రియుడిని అంతమొందించేందుకు కొత్త ప్రియుడుతో కలిసి ప్రణాళిక రచించింది. కానీ అది బెడిసికొట్టడంతో వాస్తవం అంతా బైటకు వచ్చేసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వరంగల్ సిటీలో ఫిబ్రవరి 20న యువ వైద్యుడు గాదె సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. అతడిపై కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వాళ్లు చేసిన దాడిలో అతడు హతమయ్యాడు అనుకుని ఘటనా స్థలంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడి భార్య ఫ్లోరింజా తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడంటూ ఆందోళనపడింది. కానీ అది ప్రమాదం కాదు... ఓ పథకం ప్రకారం హత్య చేసేందుకు వేసిన పన్నాగం అని పోలీసులు తేల్చేసారు. ఈ ప్రణాళికలో స్వయంగా అతడి భార్య, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడు పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.
 
వివాహేతర సంబంధానికి బీజం జిమ్ సెంటర్
సుమంత్ ను పెళ్లాడిన ఫ్లోరింజా కాజీపేట మండలం ఫాతిమానగర్‌లో వుంటున్నారు. అక్కడే సుమంత్ రెడ్డి ఆస్పత్రి కూడా వుంది. దానికి సమీపంలో జిమ్ సెంటరు కూడా వుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అక్కడ వ్యాయామం చేసేందుకు ఫ్లోరింజ వెళ్తుండేది. అక్కడే ఆమెకి శామ్యూల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లయిన కొద్ది నెలలకే శామ్యూల్‌తో ఆమె తన బంధాన్ని కొనసాగించడం ప్రారంభించింది. విషయం భర్త సుమంత్‌కి తెలియడంతో తన మకాం కాజీపేటకు మార్చాడు.
 
స్థలం మార్చినా సంబంధాన్ని మాత్రం వదల్లేదు ఫ్లోరింజా. వీలు కుదిరినప్పుడల్లా శామ్యూల్‌తో కలిసి గడపడం చేస్తోంది. దీనితో సుమంత్-ఫ్లోరింజాల మధ్య తరచూ గొడవలు జరగుతున్నాయి. ఇక ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి శామ్యూల్‌తో పూర్తిస్థాయి గడపాలంటే భర్తను అడ్డు తొలగించడమే మార్గమని యోచించింది. ఆ ప్రకారం సుమంత్ పైన సంగారెడ్డి భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద దాడి చేసి అక్కడ నుంచి పారిపోయారు. ఐతే కొన ఊపిరితో వున్న సుమంత్ తనపై జరిగిన దాడి గురించి అన్ని వివరాలు తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యాయత్నం చేసి పారిపోయిన నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేసారు. సుమంత్ భార్య ఫ్లోరింజాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...