Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష నాయకులపై వైసీపీ దాడులు: అచ్చెన్న లేఖ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సంతమాగులూరు మండలంలో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు.
 
అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments