Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మత్స్యకారులను అభివృద్ధి పథంలో నడిపే ప్రభుత్వమిదే: మంత్రి పేర్ని నాని

Advertiesment
government
, బుధవారం, 25 నవంబరు 2020 (05:41 IST)
మత్స్యకారులను అభివృద్ధి పథంలో నడిపేందుకు మత్స్యశాఖలో అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  పేర్ని నాని పేర్కొన్నారు.

ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు.  తొలుత జిల్లా మత్స్య శాఖ అధికారులు మంత్రి పేర్ని నానిను కలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో 8 లక్షల టన్నుల చేపలు రొయ్యలు ఉత్పత్తి సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినట్లు మత్స్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం - 2020 పురస్కరించుకొని గత శనివారం ఢిల్లీలో జరిగిన ఒ కార్యక్రమంలో ఆ పురస్కారానికి 3 లక్షల నగదు ,  ఒక జ్ఞాపీక  లభించిందని ఉప సంచాలకులు లాల్ మొహ్మద్ మంత్రికి తెలిపారు. ఈ విజయానికి సమిష్టి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నానన్నారు, ఇలాగే మున్ముందు సైతం కృష్ణాజిల్లా మత్స్య శాఖ రాష్ట్రంలోనే ప్రధమ స్థానాన్ని మరల మరలా కైవసం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు. 

కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని , 1 లక్షా 12 వేల 977 మంది మత్స్యకారులు జిల్లాలో నివసిస్తున్నారని పేర్కొంటూ, 4  తీర ప్రాంత మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.

మచిలీపట్నం పరిసర తీర గ్రామాలలో  సముద్రంలో  చేపల వేట ముగించుకొని  తిరిగి వచ్చే సమయంలో బోటు నడిపే మత్స్యకారునికి  తీరంలో చుక్కాని దీపాలు  కనబడక ఎంతో ఇబ్బంది పడుతున్నాడని త్వరలో సముద్ర మొగలో లైట్లు కనబడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారని తెలిపారు.

ఇక్కడ ఎత్తైన  స్తంభాలను నిర్మించి రెండు శక్తివంతమైన  విద్యుత్ దీపాలను ఏర్పాటుచేసే విషయమై చురుగ్గా ఏర్పాట్లు చేయాలనీ మంత్రి పేర్ని నాని అధికారులకు సూచించారు. అలాగే  ఫిషింగ్  హార్బర్ వద్ద  దట్టంగా ఎత్తైన  చెట్లు పెరిగిపోవడంతో అక్కడ పెద్ద టవర్ నిర్మించి శక్తివంతమైన ఎర్రని కాంతి ప్రసరించే  నియాన్ లైట్లు ఏర్పాట్లు చేయాలని వీటి మంజూరు కోసం ఎవరిని సంప్రదించాలని మత్స్యశాఖ అధికారులను అడిగారు. 

మారీ టైమ్  సి ఇ ఓ  రామకృష్ణారెడ్డికి మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి మత్స్యకారుల ఎదుర్కొంటున్న అవస్థలు తెలిపారు. దీంతో ఆ అధికారి టవర్ నిర్మాణ అంచనాలు , నియాన్ లైట్ల వివరాలు సాంకేతిక అధికారులు పంపితే తక్షణమే ఆయా నిధులు మంజూరు చేస్తానని మంత్రి పేర్ని నానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన అధినేతల కోసం ప్రత్యేక విమానం.. తొలి పర్యటన రామ్ నాధ్ దే