Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నెల 26న ఏపీ ప్రభుత్వం-అమూల్ ప్రాజెక్టు ప్రారంభం

ఈ నెల 26న ఏపీ ప్రభుత్వం-అమూల్ ప్రాజెక్టు ప్రారంభం
, శనివారం, 21 నవంబరు 2020 (06:23 IST)
ఈ నెల 26వ తేదీన ఏపీ ప్రభుత్వం-అమూల్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. పాల సేకరణ కోసం రాష్ట్రంలో 7,125 పాల సేకరణ కేంద్రాలు (బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల)ను రూ.1,362 కోట్లతో మూడు ఫేజ్ లో నిర్మిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 8 హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిందన్నారు. శనివారం ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు హార్బర్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.  రాష్ట్రంలో 400 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, వాటిలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు లక్షా 60 వేల లీటర్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయన్నారు.

200 లక్షల లీటర్ల పాలు ఇంకా కొనుగోలు చేయకుండా మిగిలిపోతున్నాయన్నారు. ఎటువంటి మిగులు లేకుండా నేరుగా ప్రభుత్వమే పాడి రైతుల నుంచి పాలు కొనుగోలు చేయనుందన్నారు. ఇందుకోసం మహిళా పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నడిచేలా  రాష్ట్రంలో 7,125 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల(బీఎంసీ)ను రూ.1,362 కోట్లతో మూడు ఫేజ్ లో నిర్మిస్తున్నామన్నారు.

తొలుత ఏపీ ప్రభుత్వం-అమూల్ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల(బీఎంసీ) ద్వారా ఈ నెల 20 వ తేదీ నుంచి పాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ నెల 26న ఏపీ ప్రభుత్వం-అమూల్ ప్రాజెక్టు ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. రైతులకు ఆర్థిక లబ్ధి కలుగజేయడమే లక్ష్యంగా రాష్ర్ట్ర ప్రభుత్వమే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల(బీఎంసీ) ద్వారా పాలు కొనుగోలు చేస్తోందన్నారు. 

8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం... ఈనెల 21 నాలుగింటికి శంకుస్థాపన...25 ఆక్వా హాబ్ ల ప్రారంభోత్సవం...
చేపల వేటకు రాష్ట్రంలో అనువైన వసతులు లేకపోవడం వల్ల ఎందరో మత్స్యకారులు వలసలు పోతున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారలకు మెరుగైన జీవనం అందించే లక్ష్యంగా రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు.

శనివారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారన్నారు. వాటితోపాటు 25 ఆక్వా హబ్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా కరోనా వల్ల మత్స్యకార పరిశ్రమపై ఎటువంటి దుష్ప్రభావమూ పడలేదన్నారు. 

రూ.5,386 కోట్లతో పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్ల స్థాపన...
వైఎస్సార్ చేయూత పథకం కింద పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి లక్షలాది మంది లబ్ధిదారులు ముందుకొచ్చారని, ఇది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వారికున్న నమ్మకానికి నిదర్శనమని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్ల స్థాపనకు రూ.5,386 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

గొర్రెలు, మేకల పెంపకానికి 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. యూనిట్ ధర రూ.75 వేలుగా నిర్ణయించామన్నారు. లబ్ధిదారులకు మేలు కలిగే నాణ్యమైన పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేస్తామన్నారు. పశువుల విషయానికి వస్తే ముర్రా, గ్రేడెడ్ ముర్రా జాతి పశువులు రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలవన్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద స్థాపించే యూనిట్ల ద్వారా 5 నుంచి 10 లక్షల లీటర్ల పాలు అదనంగా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయన్నారు. 

పశువుల కొనుగోలు లబ్ధిదారుల అభీష్టమే ఫైనల్...
పాడి పశువులను హర్యానా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ కొనుగోలు చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. గొర్రెలు, మేకలను రాష్ట్రంలోనే ఏ జిల్లాల నుంచైనా కొనుగోలు చేయొచ్చునన్నారు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు కొనుగోలుకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కమిటీలో లబ్ధిదారులతో పాటు సెర్ప్ అధికారి, బ్యాంకు ప్రతినిధి, పశు వైధ్యాధికారి ఉంటారన్నారు. లబ్ధిదారులు ఇష్టానుసారమే పాడి పశువులను, గొర్రెలు, మేకలను కొనుగోలు చేస్తామన్నారు. ట్యాగింగ్ కలిగిన పాడి పశువులను, గొర్రెలు, మేకలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, మూడ్రోజుల పాటు వాటి పాల ఉత్పత్తిని కూడా పరీక్షించిన తరవాతే కొనుగోలు చేస్తామన్నారు. అనారోగ్యంగా ఉండే పాడి పశువులను, గొర్రెలు, మేకలను కొనుగోలు చేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ నెల 21 నుంచి బ్యాంకులతో యూనిట్ల లింకేజి...
గురువారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం వరకూ జరిగే ఈ సమావేశాల్లో పశువుల కొనుగోలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగో రోజుల పాటు బ్యాంకులతో యూనిట్ల అనుసంధానం కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.

రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా పాడిపశువులు, మేకలు, గొర్రెల పెంపకం యూనిట్లను స్థాపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు గొడుగు, దుప్పటి, పాద రక్షలతో కూడిన కిట్లు అందజేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మేకలు, గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపించన తరవాత కిట్లు అందజేయయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

మూడు నెలల్లో లక్ష పాడిపశువుల పంపిణీ...
చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల మినహాయించి మిగిలిన పది జిల్లాల్లో డిసెంబర్ 31వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలఖారు వరకూ మూడు నెలల కాలంలో లక్ష పాడిపశువుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. వైఎస్సార్ చేయూత పథకం పాడి పశువులు పెంపకం ద్వారా ఇప్పుడున్న పాల ఉత్పత్తి కంటే అదనంగా 5 నుంచి 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ తర్వాత నిమ్మగడ్డను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తారేమో..!?: విజయసాయిరెడ్డి