Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక‌పై అది ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్ వే ’!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:18 IST)
యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం, యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వేగా మార్పు చేయనుంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు లైన్ల 165 కిలోమీటర్ల పొడవైన యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే గౌతమ్‌బుద్ధనగర్‌ జిల్లాలోని గ్రేటర్‌ నోయిడాను ఆగ్రాతో కలుపుతుంది. ఈ హైవే దేశంలోనే మూడో అతిపెద్ద పొడవైంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించారు.
 
అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన అందరి నుంచి మన్ననలు అందుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ హైవేకు పేరు పెట్టాలని యూపీ సీఎం భావిస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ప్రధాని శంకుస్థాపన చేయనుండగా, దీంతో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఇంతకు ముందు యూపీ ప్రభుత్వం 2018లో లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా మార్చింది. ఈ పేరు మార్పుల వ‌ల్ల ఏం ఒరుగుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు యోగి ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌డుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments