Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని వదిలేసి తెలంగాణాకు వచ్చేస్తా : జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:27 IST)
ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎల్పీలో పాత్ర మిత్రులందరినీ కలిశానన్నారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయన్నారు. 
 
ఇక తాను తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని... ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. 
 
కాగా, జేసీ దివాకర్ రెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించారు. గతంలో ఏపీ సీఎం జగన్ మావోడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా జగన్ పాలనపై కూడా విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి అనేక చిక్కులు ఉత్పన్నమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments