Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ థ్రిల్ రోజాతో దొరుకుతుందా వాణి విశ్వనాథ్...?(వీడియో)

మెగాస్టార్ చిరంజీవితో నటించిన నటి వాణి విశ్వనాథ్ రాజకీయాల్లో అడుగెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజక

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (14:29 IST)
మెగాస్టార్ చిరంజీవితో నటించిన నటి వాణి విశ్వనాథ్ రాజకీయాల్లో అడుగెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని.. రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చేఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ వస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని ప్రకటించారు. 
 
కాగా ఈ మధ్య చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు త్వరలోనే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 
 
కాగా చిత్తూరు నుంచి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయనే ఇంఛార్జ్‌గా వున్నారు. అలాంటి తరుణంలో పార్టీలో చేరకముందే వాణి విశ్వనాథ్ నగరి నుంచి పోటీ చేస్తాననడం గాలికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆమె ఇష్టానుసారంగా తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై గాలి ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. మరి వాణికి నగరి టికెట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారా? అనేది వేచి చూడాలి. 
 
ఇకపోతే రోజా మాటలను కట్టడి చేసేందుకే మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.... ఒక పార్టలో వున్న తర్వాత ప్రత్యర్థి పార్టీలో వున్నవారందరికీ కౌంటర్లు ఇవ్వాల్సిందే. ఐనా సరైన ప్రత్యర్థి వుంటే ఆ థ్రిల్లే వేరు అంటోంది. మరి ఈ థ్రిల్ రోజాతో దొరుకుతుందా...? చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments