జూనియర్ ఎన్‌టిఆర్ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు... వెనుక వున్నదెవరు?
2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత రాజకీయాల జోలికే వెళ్ళలేదు. అంతర్గత విభేధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలియదు కానీ ఆ తరువాత ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం పూర్తిగా మానేశారు. సినిమాపై
2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత రాజకీయాల జోలికే వెళ్ళలేదు. అంతర్గత విభేధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలియదు కానీ ఆ తరువాత ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం పూర్తిగా మానేశారు. సినిమాపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి పడిపోయిన తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు జూనియర్. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్‌టిఆర్‌ను వాడుకోవడం వదిలేశారు.
కానీ ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగు సినీ పరిశ్రమలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. తన స్నేహితుడు వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ప్రస్తుతం జూనియర్ రాజకీయ ప్రవేశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి అంతర్గతంగా మాస్టర్ ప్లానే వేసేస్తున్నారట. సొంతంగా పార్టీ పెట్టాలని నాని జూనియర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. తన పేరు తెరపైకి రాకుండా నాని అన్నీ చేసేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఈమధ్యే జూనియర్ ఎన్‌టిఆర్ పార్టీ పేరు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విషయం కాస్త అలా ఇలా చంద్రబాబు దృష్టికి వెళ్ళిందట... దీంతో బాబు ఎన్‌టిఆర్ పార్టీ పెట్టనీయకుండా తెలుగుదేశం పార్టీకే వచ్చే ఎన్నికల్లో జూనియర్ సపోర్ట్ చేసేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కానీ కొడాలి నాని మాత్రం జూనియర్ ఎన్‌టిఆర్ సొంత పార్టీతో ప్రజల్లోకి వెళితే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకొస్తున్నారట. దీంతో ఎన్‌టిఆర్ ఏం చేయాలో పాలుపోక ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి వేచి చూసే ధోరణిలో ఉండాలన్నది జూనియర్ ఎన్‌టిఆర్ ఆలోచనట.