Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎత్తి దింపుడు పథకంగా కాళేశ్వరం : దత్తాత్రేయ

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (18:23 IST)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తి దింపుడు పథకంగా మారిందని కేంద్రమాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాట వినకుండా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో వెళ్లారన్నారు. సాంకేతిక లోపం కారణంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజి నుంచి తిరిగి కాళేశ్వరంలోకే నీళ్లు వస్తున్నాయని.. దీంతో రూ.80 వేల కోట్ల నష్టం జరుగుతుందన్నారు. 
 
నష్టానికి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సాంకేతిక నిపుణులు, ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని.. కేసీఆర్ తప్పిదం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో వారం రోజుల నుండి పడుతున్న వర్షాల వల్ల చాలా మంది అనారోగ్యబారిన పడుతున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగు, చికెన్ గున్యా బారిన పడుతున్నారన్నారు. 
 
సరైన సమయంలో రక్త పరీక్షలు చేయకపోవడం వల్ల చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ హస్పిటల్‌లో సరిపోను డాక్టర్లు, వసతులు లేని కారణంగా ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ ఏర్పాటు చేయాలన్న ఆయన.. గిరిజన ప్రాంతాల్లో దుప్పట్లు సరఫరా చేయాలని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వసతులు కల్పించాలని సూచించిన దత్తన్న.. బీజేపీ సభ్యత్వం చాలా వేగవంతంగా జరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments