ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు.
గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చూడండి వీడియో...