Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?.. ప్రధాని మోడీకి కేసీఆర్ ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్నటికిమొన్న.. అలవాట్లో పొరపాటులా మోడీగారు అనబోయి.. మోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు.

Advertiesment
మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?.. ప్రధాని మోడీకి కేసీఆర్ ప్రశ్న
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్నటికిమొన్న.. అలవాట్లో పొరపాటులా మోడీగారు అనబోయి.. మోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్నారు. ఇపుడు మరోమారు ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. 
 
ఆదిలాబాద్‌ జిల్లాలోని కోర్టా - చనకా బ్యారేజీ పనులను మంగళవారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రైతులు పండించే పంటలకు మద్దతు ధర పెంచితే 'మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?' అంటూ ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు. దేశంలో రైతులు సహనం కోల్పోతున్నారని, వారి ఓపికను పరీక్షించడం జాతీయ పార్టీలకు మంచిది కాదని  హెచ్చరించారు. 
 
దేశవ్యాప్తంగా భగవంతుడు 70 వేల టీఎంసీల నీటిని వరంగా ఇస్తే.. చేతకాని జాతీయ పార్టీలు, నేతలు కేవలం 24 వేల టీఎంసీలను వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మించడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ఆ రెండు జాతీయ పార్టీలూ తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ సభాముఖంగా డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయేంద్ర సరస్వతి చుట్టూ వివాదాలెన్నో... తెలంగాణా ఇస్తే అది మరో కాశ్మీరే