Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది కానుక

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:06 IST)
హైదరాబాద్ మహానగరంలోని మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉగాది కానుక ఇవ్వనున్నారు. అటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు.. ఇటు ఆదాయాన్ని రాబట్టుకునే దిశగా హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని స్మార్ట్ కార్డు ధరను రూ.75కే అందజేయనుంది. ఈ సదుపాయం మూడు నెలల వరకు కల్పించనుంది. 
 
ఇప్పటివరకూ ఈ కార్డు కోసం రూ.150 లు చెల్లించాల్సి వచ్చేది. ఇది సామాన్య ప్రయాణీకులకు భారంకాగా.. మెట్రో ఎక్కేందుకు సామాన్యులు ఆసక్తిని చూపించటంలేదు. ఈ క్రమంలో ప్రయాణీకులు మెట్రో ఎక్కేలా చేసేందుకు ఉగాది పండుగ సందర్భంగా స్మార్ట్ కార్డ్ రేటును హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం తగ్గించింది. 
 
ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, ఎక్కుగా (గరిష్టంగా) 3 వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. రూ.150 చెల్లించాల్సిన స్మార్డ్ కార్డ్ రూ.75లు చెల్లించి తీసుకోవచ్చు. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించనక్కరలేకుండానే ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఉగాది ఆఫర్‌ను వినియోగించుకుందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. స్మార్ట్ కార్డ్ రేటు తగ్గించడంతో ఈ కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో ట్రైన్ సంస్థ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం