హైదరాబాద్‌లో 'యాప్‌'ల హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:35 IST)
లొక్యాన్టో యాప్, హైదరాబాద్ ఎస్కార్ట్స్ అనే పలు ఇంటర్నెట్ యాప్‌ల ద్వారా విటులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా అమీర్‌పేట, పంజాగుట్టలలోని ఖరీదైన హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేసారు ఎస్సార్ నగర్ పోలీసులు. 
 
అమీర్‌పేటలోని ఆదిత్యా పార్క్ ఇన్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వై.అజయ్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేసారని, అందుకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. హోటల్ గదిలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులతోపాటు హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
వారికి అందిన సమాచారం మేరకు పంజాగుట్టలోని పోలో లాడ్జింగ్‌పై దాడి చేసారు, హోటల్ గదుల్లో ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన ఐదుగురు యువతులతోపాటు నలుగురు విటులను కూడా అరెస్ట్ చేసారు. 
 
వ్యభిచార కార్యకలాపాల వెనుక రాహుల్, సూర్య అనే ఇద్దరు నిర్వాహకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అని అన్నారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నరా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువతులంతా టూరిస్ట్ వీసాపై వచ్చినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఉపాసన చిన్నాన్నకు మద్దతుగా చిరంజీవి ప్రచారం...