జనసేన పార్టీ తరపున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నటుడు నాగబాబుపై సినీ రచయిత చిన్నకృష్ణ విమర్శలు దాడిచేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన్నారు.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవికి లక్షలాది మంది ఓటర్లు ఓటు వేస్తే ఏం జరిగిందో అందరూ ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.
అలాగే, భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని ఆయన అన్నారు. ఈ స్థానంలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి శ్రీనివాస్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని చిన్నికృష్ణ జోస్యం చెప్పారు.