సుగుణమ్మ భ్రష్టుపట్టిస్తున్నారు... బోరున ఏడ్చేసిన తుడా చైర్మన్...

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (20:44 IST)
తిరుపతి టిడిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్ళ కేటాయింపులో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ మధ్య విభేధాలు బయటపడ్డాయి. తనకు ఇష్టమొచ్చిన వారికి ఎన్టీఆర్ గృహకల్ప కేటాయింపులను ఎమ్మెల్యే చేస్తున్నారని, తాము రెకమెండేషన్ చేసే వారిని పక్కనపెట్టేస్తున్నారని ఆరోపించారు తుడా ఛైర్మన్. 
 
తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే సుగుణమ్మ భ్రష్టు పట్టిస్తున్నారని, నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కంటతడి పెట్టారు. సుగుణమ్మ వ్యవహార శైలితో తుడా ఛైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు తుడా ఛైర్మన్.
 
తనపై నిరాధారమైన ఆరోపణలు తుడా ఛైర్మన్ చేస్తున్నారన్నారు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఎన్టీఆర్ గ్రుహ కల్ప ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయని, తన వ్యక్తిగతంగా ఎవరికీ ఇళ్ళను కేటాయించడం లేదన్నారు ఎమ్మెల్యే. అయితే గత కొన్నిరోజుల ముందు ఎమ్మెల్యే సీటు కోసం నరసింహ యాదవ్ సిఎంను కలవడం సుగుణమ్మకు ఇష్టం లేదు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ప్రారంభమైనట్లు ప్రచారంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

Nagarjuna's Memories: విక్రమ్ కు 40 ఏళ్ళు - మనం ను మర్చిపోలేని తేదీ : నాగార్జున మెమొరీస్

తర్వాతి కథనం
Show comments