Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RGV 'ఆఫీసర్' దెబ్బకు అయిపోయా... ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటున్న ఆంధ్రా బయ్యర్

వర్మ తనను ముంచేశాడని ఆఫీసర్ చిత్రం రైట్స్ కొనుగోలు చేసిన సుబ్రహ్మణ్యం అనే డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ... ఆఫీసర్ షూటింగ్ చేస్తున్న సమయంలో వర్మ తనను నమ్మించి రూ. 1.30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సిని

Advertiesment
RGV 'ఆఫీసర్' దెబ్బకు అయిపోయా... ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటున్న ఆంధ్రా బయ్యర్
, మంగళవారం, 5 జూన్ 2018 (14:36 IST)
వర్మ తనను ముంచేశాడని ఆఫీసర్ చిత్రం రైట్స్ కొనుగోలు చేసిన సుబ్రహ్మణ్యం అనే డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ... ఆఫీసర్ షూటింగ్ చేస్తున్న సమయంలో వర్మ తనను నమ్మించి రూ. 1.30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సినిమా పూర్తయి విడుదలైన తర్వాత కూడా తన డబ్బు ఇవ్వట్లేదని ఆరోపించాడు.
 
డబ్బు అడిగితే కోర్టుకు వెళ్లి తెచ్చుకో అని తనను బెదిరించాడని చెప్పుకొచ్చాడు. సరే ఎలాగోలా ఈ సమస్య నుంచి బయటపడాలని ఉభయగోదావరి జిల్లాల రైట్స్ ఇవ్వాలని అడిగితే కేవలం గోదావరి రైట్స్ మాత్రమే ఇచ్చే ఉద్దేశ్యం తనకు లేదనీ, కావాలంటే ఏపీ రైట్స్ మొత్తం తీసుకోమని గుదిబండలా మెడలో వేసాడన్నారు. ఎటూ గత్యంతరం లేక మరో రూ. 3.5 కోట్లు చెల్లించి ఏపీలో సినిమాను విడుదల చేసినట్లు తెలిపారు. 
 
ఐతే మొదటి ఆట నుంచే తనకు చుక్కలు కనబడ్డాయనీ, దారుణంగా కలెక్షన్లు రాకుండా పోయాయని విలపించాడు. తనకు భారీగా నష్టాలను తెచ్చిందనీ, ఇక ఇప్పుడు తన ముందు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని బోరుబోరున విలపిస్తున్నాడు. మరి దీనిపై వర్మ గానీ, నాగార్జున కానీ ఏమన్నా మాట్లాడుతారో లేదో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిట్‌కాయిన్ స్కాంలో బాలీవుడ్ హీరోయిన్ భర్త...