Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపురం వద్ద గల్లంతై... కొరమేనుగుంటలో శవమై తేలి...

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (18:07 IST)
ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి,  గలంతైన  సుబ్బారావు మృతదేహాన్ని ఎట్టకేలకు గుర్తించి, శనివారం వారి కుటుంబ సభ్యులకు  అందించారు. వారం రోజుల కిందట సుబ్బారావు తాను పనిచేసిన ఓ కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా,స్థానిక లక్ష్మీ పురం కూడలి వద్ద వరద నీటి  కాలువలో కొట్టుకు పోయిన విషయం తెలిసిందే.  దీంతో  వారి కుటుంబ సభ్యులను ఆ మర్నాడే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ని ఆశ్ర‌యించారు. గల్లంతైన  సుబ్బారావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు  చేపట్టాల్సిందిగా నగర పాలక సంస్థ సిబ్బందిని ఆదేశించారు. 
 
 
ఈ క్రమంలో నిరంతరం గాలింపు చర్యలు  కొనసాగాయి.  అయినప్పటికీ సుబ్బారావు ఆచూకీ లభించక పోవడంతో ఎన్ ఆర్ డీ ఎఫ్ ను  రంగంలోకి దింపడం ద్వారా గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయించారు.  చివరకు శనివారం కొరమేని గుంట వద్ద చేపలు పట్టేందు వెళ్లిన కొంత మంది ద్వారా మృతదేహం పడివున్నట్టు సమాచారం అందడంతో...సిబ్బందితో పాటు భూమన కరుణాకర రెడ్డి అక్కడికి చేరుకున్నారు.  బురద  గుంటలో దిగబడి పోతుండడంతో మృతదేహాన్ని తీసుకురావడం కష్టంగా మారింది. 
 
 
ఈ దశలో జేసీబీ  సహాయంతో సిబ్బంది అతికష్టం మీద మృత దేహాన్ని గుంటలో నుంచి వెలుపలకు  చేర్చారు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో మృత దేహాన్ని తిరుపతి  ముస్లీం జేఏసీ ప్రతినిధులు ఎస్ కే బాబు, జే ఎం డీ గౌస్, నగర పాలక సిబ్బందితో పాటు భూమన కరుణాకర రెడ్డి స్వయంగా స్ట్రెచర్ మీద మోసి,  అంబులెన్స్ లోకి చేర్చారు. మరో వైపు  సుబ్బారావు కుటుంబ సభ్యులను భూమన కరుణాకర రెడ్డి ఓదార్చారు. నగర మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ పీఎస్ గిరీషా,  ఎస్పీ వెంకట అప్పల నాయుడు, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments