ఆంధ్రప్రదేశ్ అనంతరపురం జిల్లాలోని బత్తలపల్లి తహశీల్దార్ కార్యాలయంలోని టేబుల్‌పై శవం ప్రత్యక్షమైంది. తహశీల్దార్ టేబుల్‌పై జలాలపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలి శవం ఉంచారు. ఈ పని చేసింది ఆమె కుమార్తెలు రత్నమ్మ, నాగేంద్రమ్మ, లింగమ్మ ఆందోళనకు దిగారు.
ఏడు సంవత్సరాల క్రితం లక్ష్మీదేవమ్మ భర్త పెద్దన్న చనిపోయాడు. పెద్దన్న పేరుతో బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామంలో ఐదు ఎకరాల భూమి ఉంది. పెద్దన్నకు సంబంధించిన భూమి రికార్డులను తన పేరుతో మార్చాలంటూ కొన్ని సంవత్సరాలుగా లక్ష్మీదేవి కార్యాలయం చుట్టూ తిరిగింది.
కానీ, బత్తలపల్లి తహసిల్దార్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో లక్ష్మీదేవి మనస్తాపంతో మృతి చెందింది. తల్లి లక్ష్మీదేవి చావుకు రెవెన్యూ అధికారులే కారణమంటూ కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తూ, లక్ష్మీదేవి శవంతో బత్తలపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఆందోళనకుదిగారు.
తమకు న్యాయం చేయాలంటూ లక్ష్మీదేవి కుమార్తెలు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను పోలీసులు శాంతపరిచారు.