28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (09:50 IST)
ఈ నెల 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున పాక్షి చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7.05 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం పూర్తి చేసిన తర్వాత 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. అంటే మొత్తం 8 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. 
 
అందువల్ల 28వ తేదీన రాత్రి 7.05 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3.15 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత నుంచి యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాలను 28వ తేదీన రద్దు చేశారు. అలాగే పెరటాసి రద్దీ కారణంగా సోమవారం కూడా ఎస్ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments