పౌర్ణమి సందర్భంగా ఏర్పడిన చంద్రగ్రహణం సమయంలో ప్రధాన రహదారిపై పాము కనబడింది. ఈ పాముకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మార్కులాపురం రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చంద్ర గ్రహణం సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపై నాగుపాము గుర్తించారు. హారన్ల మోత మోగించారు.
వాహనాల నుంచి అలా పెద్ద శబ్దాలు వచ్చినా కూడా ఆ పాము కదల్లేదు. చివరికి చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత పాము రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది.