Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో కరోనా ఫీవర్.. నిండిపోతున్న ఆస్పత్రులు

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:37 IST)
చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇపుడు హైదరాబాద్ నగరంలో కూడా కలకలం రేపుతోంది. ముఖ్యంగా, పలువురికి ఈ వైరస్ సోకిందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనికితోడు పలు ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేసివుంచారు. ఈ క్రమంలో జ్వరం, తలనొప్పి, జలుబుతో బాధపడుతున్న వారంతా తమకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. 
 
ఇటీవల చైనా నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తితోపాటు, కర్మన్‌ఘాట్‌కు చెందిన వ్యక్తి (26) శనివారం ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. వీరిద్దరూ జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. అలాగే, చైనా నుంచి వచ్చిన గోల్కొండకు చెందిన వ్యక్తి (32)కి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.  
 
ఈనేపథ్యంలో గత నెల 25 నుంచి ఈనెల రెండో తేదీ వరకు 18 మంది అనుమానితులు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. గత నెల 25 నుంచి 27 మధ్య ఐదుగురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురికి ఏమీ లేదని తేలింది. ఒకరిలో మాత్రం స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చికిత్స చేసి పంపారు.
 
ఇక 28వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా భయంతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వీరికి కూడా స్వైన్‌ఫ్లూ సోకినట్టు గుర్తించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. ఆ తర్వాత మరికొందరు కూడా పరీక్షల కోసం ఆసుపత్రికి తరలివచ్చారు. వీరిలో కొందరి నమూనాలను సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. మొత్తంమీద హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments