Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో మూడో కరోనా కేసు.. చైనాలో ఒక్క రోజే 57 మంది మృత్యువాత

Advertiesment
భారత్‌లో మూడో కరోనా కేసు.. చైనాలో ఒక్క రోజే 57 మంది మృత్యువాత
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (13:24 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా భారత్‌లో మూడో కేసు నమోదైంది. కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరం నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రోగిని ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే, చైనాలో పర్యటించవద్దని దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా, చైనా నుంచే భారత్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ వైరస్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఫలితంగా చైనీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 57 మంది చనిపోవడం షాకిచ్చింది. ఇది చాలదన్నట్లు ఒకేరోజు కొత్తగా 2,829 మంది వ్యాధి బారినపడినట్టు తేలడం వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణ మృదంగం ఎక్కడికి చేరుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, బాధితుల సంఖ్య ఇప్పటివరకు 17,205కి చేరింది. మరో 1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చైనా నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్.. ట్రయల్ రన్ ప్రారంభం.. ఇక ట్రాఫిక్‌కు స్వస్తి