Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల నేరాలు ఘోరాలు.. ట్రాక్టర్ బోల్తా.. వైకాపా కార్యకర్త చైన్ స్నాచింగ్ (video)

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (18:15 IST)
Bapatla
బాపట్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల కర్లపాలెం మండలం యాజలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 
 
శిగమట మండలం గట్టువారి పాలెం గ్రామానికి చెందిన కొండపాటూరు చెట్లు కోసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యాజలి జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తక్షణ వైద్యం నిమిత్తం తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు చైన్ స్నాచింగ్ కేసులో వైకాపా కార్యకర్తే బాపట్లలో బయటపడ్డారు. బాపట్లలో వైసిపి కార్యకర్త విజయ్ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దృశ్యం మీడియాలో వైరల్ అవుతోంది. వైకాపా కార్యకర్తగా వుండి రోడ్డుపై నిల్చున్న మహిళ వద్ద ఏదో మాట్లాడుతూ.. ఆమె చైన్‌ను లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments