Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

police

ఐవీఆర్

, ఆదివారం, 23 జూన్ 2024 (00:07 IST)
బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని ఈపూరుపాలెంలో జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. శుక్రవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేసారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అనంతరం బాధితురాలి తలపై రాయితో కొట్టి హతమార్చారు.
 
ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరించారు. ఆరోజు వేకువజామున యువతి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే గంజాయి, మద్యం తాగుతూ వున్న నిందితులు యువతిని గమనించి ఆమెను పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమె తలపై రాయితో మోది హత్య చేసారు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తమ దుస్తులపై మరకలు పడటంతో దుస్తులు మార్చుకుని తిరిగి ఏమీ ఎరగనట్లు స్థానికులతో పాటు వీరు కూడా కలిసి వచ్చారు. ఐతే వారిపై ఇంతకుముందే క్రిమినల్ కేసులు వుండటంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా వుంచారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవం బయటకు వచ్చింది.
 
కాగా యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని శుక్రవారం నాడు ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి ఈపూరుపాలెంకు బయలుదేరి వచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించి నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేట్లు చూస్తామని ఆమె హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ బ్రోకరేజీల నుండి బలమైన మద్దతును అందుకున్న స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపిఓ