Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసిపిపై తీవ్రమైన కసి... తెదేపాలో చేరిన 30 రోజుల్లోనే ఆయన బాపట్ల ఎంపి అయ్యారు

Bapatla MP

ఐవీఆర్

, గురువారం, 6 జూన్ 2024 (13:11 IST)
ఎన్నికల్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అదికూడా లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడుగా విజయం సాధించాలంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. ఏడెనిమిది నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరినీ ప్రసన్నం చేసుకోవాలి. కనీసం రెండుమూడేళ్ల పాటు ప్రజల్లో తిరుగుతూ, వారి బాగోగులు చూస్తూ వుంటేనే విజయం సాధ్యమవుతుంది. అలాంటిది కేవలం 30 రోజుల వ్యవధిలో తెదెపాలో చేరి ఎంపీ అయ్యారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, బాపట్ల తెదేపా ఎంపిగా బరిలో దిగి 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థిని మట్టికరిపించారు ఆయన. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్.
 
తెలంగాణ భాజపా అధికార ప్రతినిధిగా పనిచేసారు. అక్కడ భాజపా నుంచి టిక్కెట్ రాకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఆయన అత్తగారు గతంలో తెదేపా హయాంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర వుండటంతో బాపట్ల నుంచి ఆయనకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. బాపట్ల నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరన్న సంగతి కూడా పెద్దగా తెలియదు కానీ వైసిపి పైన వున్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల ప్రజలంతా సైకిల్ పైన గుద్దేశారు.

అంతే కృష్ణ ప్రసాద్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఇలాంటివారు కూడా తమను ఓడించడంపై వైసిపి అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమపై ప్రజలకు ఇంతమేర కసి వున్నదా అని షాక్ తింటున్నారు. కారణాలు ఏమిటన్నది అంతర్మథనం చేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాలలో భారీ వర్షాలు... పొంగి పొర్లుతున్న వాగులు.. ఉధృతంగా కాకిలేరు నది