Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్డీయే బిల్లు కమిటీ ఛైర్మన్‌గా బొత్స - వికేంద్రీకరణ కమిటీ బిల్లు పెద్దగా మంత్రి బుగ్గన

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:00 IST)
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులకు వేర్వేరుగా రెండు కమిటీలను మండలి ఛైర్మన్ ఏర్పాటు చేశారు. వీటిలో సీఆర్డీయే బిల్లు రద్దు కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్సన సత్యనారాయణను నియమించారు. అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు కమిటీ పెద్దగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు ఉంటారు. 
 
అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సభ్యులుగా తెదేపా నుంచి నారా లోకేశ్, తిప్పేస్వామి, అశోక్ బాబు, సంధ్యారాణి, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్ రెడ్డి, పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు ఉన్నారు.
 
వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తాము భాగస్వామ్యం కాబోమంటూ మండలి ఛైర్మన్ షరీఫ్‌కు  వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి లేఖ రాసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments