Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులు? ఒకే కుటుంబంలో ఐదుగురికి?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:54 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా చైనా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వీరందరినీ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. 
 
చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ఇపుడు సుమారు 20 ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ కోవలో భారత్‌లో కూడా ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
ఈ క్రమంలో ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. 
 
ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది. గురువారం ఉదయం ఓ యువతి కేరళ నుంచి రాగా, ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆమె కూడా గాంధీ ఆసుపత్రిలో చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments