Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది: జేపీ నడ్డా

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:43 IST)
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ఆయన నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు.
 
ఏపీలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉంది.
 
ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది. లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయి. సీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది.’’ అని జేపీ నడ్డా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments