Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గుగుడిలో అవినీతికి ఆ ఇద్దరే ప్రధాన కారకులు: కేశినేని నాని

Advertiesment
corruption
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:17 IST)
దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదని ఎంపీ కేశినేనా నాని అన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి  ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బుబు అని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉందని...మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని...మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో అది రుజువైందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్యానించారు.

కేంద్రం నుంచి తాను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నులు వేయటానికే తప్ప అభివృద్ధి మాత్రం వైసీపీ పట్టించుకోవటం లేదని కేశినేని నాని విమర్శించారు. 
 
దుర్గగుడిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. దుర్గగుడి అవినీతి విచారణతో అంత మందిని సస్పెండ్ చేసి అసలు సామ్రాట్‌ను వదలడం స్వామి వారి ఆశీస్సులతోనేనా? అని ప్రశ్నించారు.

ఈ దెబ్బతో స్వామి వారి గొప్పదనం రాష్ట్రమంతా పాకిందన్నారు. ఇక అవినీతిపరులంతా స్వామీజీని ఆశ్రయిస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. అధర్మం రాష్ట్రంలో విజయపధంలో నడుస్తుందిగా? అంటూ వర్ల రామయ్య యెద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రో బాదుడు యధాతథం... పట్టించుకోని కేంద్రం