స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నవాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మంత్రి గుమ్మనూరు జయరాం బెంజ్ కారు విషయంలో ఇప్పటికీ సరైన సమాధానం చప్పలేదన్నారు. మల్లీ 400 ఎకరాలకు పైగా దోపిడీకి పాల్పడ్డారు. వాటిని ఆధారాలతో చూపించామని తెలిపారు. అవినీతిని ప్రశ్నిస్తే బూతులు మట్లాడి దాడులు చేసి, పోలీసులతో బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సొమ్మును వైసీపీ నాయకులు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తిచూపిన వాళ్ల ఇళ్లను కూల్చే పనిలో పడ్డారని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేత మొదలు రాష్ట్రంలో విధ్వంసం మొదలైందని అన్నారు. వర్షాలు పడుతున్నా రైతలుకు నీరందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి జయరాం అవినీతిని అచ్చెన్నాయుడుకు అంటగట్టారని, ఈఎస్ఐ స్కాంలో నిందితుడు నుండి కార్లు బహుమానంగా తీసుకున్నారని వివరించారు. వైసీపీ వాళ్లు జైలుకెళ్లారని అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని, అవినీతికి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు.