Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

296వ రోజు హోరెత్తిన రాజధాని నిరసన

Advertiesment
296వ రోజు హోరెత్తిన రాజధాని నిరసన
, గురువారం, 8 అక్టోబరు 2020 (09:49 IST)
"ప్రజలిచ్చిన పదవికే అన్ని హక్కులుంటే ఆ పదవులు కట్టబెట్టిన ప్రజలకు ఇంకెన్ని హక్కులు ఉండాలి పాలకులారా  తస్మాత్ జాగ్రత్త, మాహక్కులు కాలరాయాలని చూస్తే మీకు ఏహక్కులు లేకుండా చేసేహక్కులు మాకున్నాయి" అంటూ రైతులు హెచ్చరిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
 
మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో 296వ రోజు గురువారం అమరావతికి మద్దతుగా రైతులు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు బాల రామాయణం లోని సుందరకాండ పారాయణం చేసి రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . 
 
ఈ కార్యక్రమంలో నాయుడుపార్వతి, బిట్రారామలక్ష్మమ్మ, ధోనెపెద్దమ్మాయి, బత్తినెని. రాజేశ్వరి, మకెసత్యవతి ఆకుల. వరలక్ష్మి, మకెయశోద పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో  అమరావతి జెఎసి నాయకులు  ఆకుల ఉమామహేశ్వర రావు ,చనుమాలు వాసు, గ్రామ రైతులు గణేష్ ,కానుకలరాఘవయ్య, రంగారావు, రావిమహేశ్వమ్మ, ధోనెశ్రీనివాసరావు, ఆకుల. కోటయ్య, కర్ణాటక శివ సత్యనారాయణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కృష్ణాయ పాలెంలో నిరసన
మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం గ్రామంలో  రాజధాని అమరావతికి మద్దతుగా రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 296వ రోజు  నిర్వహించారు.

నిరసన కార్యక్రమంలో ఆవల రవికిరణ్, లంకా బోసు, పెద్ద వెంకటేశ్వరరావు హరి, శ్రీనివాసరావు గరికపాటి వెంకటేశ్వరరావు పెద్ది నాగార్జున నారాయణ విక్రమ్ ఆవల ప్రకాష్ రావు మొన్న బాబు రావు గరికిపాటి నాని మామూలు ప్రకాష్ రావు మన్నం శరత్ బాబు పెద్ది చెన్నాయి,ఆవుల వెంకటేశ్వరరావు, బోయపాటి సుధారాణి, గరికపాటి సుశీల, గరిగిపాటి విజయలక్ష్మి నీరుకొండ సునీత ఎలవర్తి అనిత, తదితరులు పాల్గోన్నారు.
 
బేతపూడి గ్రామంలో నిరసన 
బేతపూడి గ్రామంలో  మూడు రాజధానులకు వ్యతిరేకంగా  అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని  గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు 296వ రోజుకు చేరుకున్నాయి.  
 
ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు  రాజధాని అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీను కర్నాటి కృష్ణ  రాణిమేకల బాలయ్య  కోసూరి భీమయ్యా అడపా వెంకటేశ్వరరావు జగడం కొండలరావు  సాదరబోయిన నరసింహారావు  వాసా వెంకటేశ్వరరావు  అడవి శివ శంకరరావు,  అడపా బేతపూడి యోహాను, శిరంసెట్టి దుర్గరావు , కలవకోల్లు  నరసింహస్వామి,  జూటు దుర్గరావు,   బేతపూడి శేషగిరిరావు,  యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.
 
పెనుమాకలో రైతుల నిరసన దీక్ష
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 296వ రోజు నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు. 
 
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ముప్పేర సదశివరావు,పఠాన్ జానీ ఖాన్,ముప్పేర సుబ్బారావు,ఉయ్యురు శ్రీనుబాబు,మోదుగుల తాతయ్య, బండ్లమూడి.ఫణి,ముప్పేర మాణిక్యాలరావు, షేక్ సాబ్‌జాన్‌,మన్నవ వెంకటేశ్వరరావు, కళ్ళం రామిరెడ్డి,  మన్నవకృష్ణారావు,మన్నవ రాము,మన్నవ శ్రీనివాసరావు,కర్పూరపు నాగేంద్రం, తదితర రైతులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజాయితీగా ప‌నిచేస్తున్న సి.ఎం.కు అండ‌గా నిల‌వండి: మంత్రి బొత్స