Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుక సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్దు: జ‌గ‌న్

ఇసుక సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్దు: జ‌గ‌న్
, సోమవారం, 19 అక్టోబరు 2020 (19:50 IST)
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్ద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని, ధర కూడా తక్కువగా ఉండాలని అధికారులకు సూచించారు.

ఈ మేరకు సోమవారం ఆయన తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నూతన ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించారు. స‌మీక్ష‌లో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ప‌లువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సీఎం జగన్ అన్నారు.

ఇసుక రీచ్ల సామర్థ్యం పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయన్నారు. ఎవరైనా వచ్చి చలానా కట్టి ఇసుక తీసుకెళ్లేలా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నియోజకవర్గాలు. ప్రాంతాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలన్నారు. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎస్‌బీ పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు.

గుత్తేదారు ప్రత్యామ్నాయ రవాణా వసతి కూడా కల్పించాలన్నారు. నియోజకవర్గంలో నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయించేందుకు వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు రాయితీపై ఇసుక సరఫరా చేయాలన్నారు.

రాయితీ ఇసుకను ఎంతదూరం వరకు సరఫరా చేయొచ్చో పరిశీలించాలని ఈ సంద‌ర్భంగా సీఎం  జ‌గ‌న్ ‌అధికారులను ఆదేశించారు. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాల‌న్నారు. కాంట్రాక్టర్‌ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి.

ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అస్సలు అమ్మడానకి వీల్లేదు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా. టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయవచ్చు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూపన్లు ఇచ్చి, వాటిపై సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు.

నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించిన సీఎం వైయస్‌ జగన్ ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి, ప్రజల సూచనలు, సలహాలు పొందడంతో పాటు వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని గారూ, లోకేష్ అమెరికా వెళ్తే... హమ్మ! హమ్మ!! దివ్యవాణి ఎన్నేసి మాటలన్నది?