Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని గారూ, లోకేష్ అమెరికా వెళ్తే... హమ్మ! హమ్మ!! దివ్యవాణి ఎన్నేసి మాటలన్నది?

Advertiesment
నాని గారూ, లోకేష్ అమెరికా వెళ్తే... హమ్మ! హమ్మ!! దివ్యవాణి ఎన్నేసి మాటలన్నది?
, సోమవారం, 19 అక్టోబరు 2020 (19:23 IST)
టీడీపీ నాయకురాలు దివ్య వాణి ఏపీ మంత్రి కొడాలి నాని దుమ్ము దులిపేశారు. వైసీపీ నేతలకు ఆయన తరహాలోనే కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు.

లోకేశ్‌ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేశ్ సొంతమన్నారు. విజన్ ఉన్న నాయకుడి తనయుడిగా లోకేశ్‌కు కష్టపడే స్వభావం ఉందన్నారు.

‘‘అయినా  మీలాంటి ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని వ్యక్తులతో మాటలు పడుతున్నారు. ఏమండోయ్ నాని గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది. అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ... పని చేసుకుంటూ వెళుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ప్రజలు నమ్మి పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో వేదనను అనుభవిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేయకండి. అప్పు చేసి పప్పుకూడులా... ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. సీఎం బాధ్యతగా వ్యవహరించడం లేదు’’ అంటూ దివ్యవాణి ఘాటు విమర్శలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 10,000 ఆర్థిక సహాయం