Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుంది: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:29 IST)
ఎల్.జి. పాలీమర్స్ లీకేజీ ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. ఎ

ల్.జి. పాలీమర్స్ ను శుక్రవారం ఆయన సందర్శించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ లీకేజీ ట్యాంకు పరిస్థితి ఏవిధంగా ఉన్నది, ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటిలో కెమికల్స్ వివరాలు, వాటి పరిస్థితి, ఉష్ణోగ్రత, పారామీటర్స్ వివరాల గురించి పాలీమర్స్ యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

వాతావరణంలో రసాయనాలు జీరో స్థాయి వస్తేనే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆ గ్రామాలకు తిరిగి నివాసం ఉండొచ్చని చెప్పారు.  సాంకేతిక నిపుణుల బృందం కూడా వస్తుందని, అదనంగా సెఫ్టీ మెజర్స్ సేకరణ చేస్తామని చెప్పారు.  ప్రతీ గంటకు పొల్యూషన్ స్థాయి ఏ విధంగా ఉన్నదీ తెలుసుకొని తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

కంపెనీ పరిసర వాతావరణంలో రసాయనాల పరిస్థితి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తీసుకొనవలసిన చర్యలను గురించి అధికారులు, యాజమాన్యంతో చర్చించినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments