Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:28 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. ఆగస్ట్ 31లోపు కేసుపై విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు తొమ్మిది నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. 
 
అయితే, ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రభావం కేసు విచారణ మీద కూడా పడిందని, మరికొంత గడువు కావాలంటూ సీబీఐ కోర్టు జడ్జి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఆగస్ట్ 31 వరకు గడువును పొడిగించింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని, ఈ సారి ఆగస్ట్ 31 గడువును మాత్రం దాటొద్దని స్పష్టం చేసింది. 
 
ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సుప్రీంకోర్టు 2017లో రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. 2019లో గడువు పూర్తవడంతో మరో 9 నెలలు పొడిగించింది, ఆ గడువు కూడా ముగియడంతో మరో 4 నెలలు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంచితే సీబీఐ కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్ 2019లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఈ కేసుపై విచారణ కోసం ఆయన పదవీకాలాన్ని కూడా పొడిగించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments