Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ లేఔట్లను నిలువరించేందుకు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్!

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (05:21 IST)
అనుమతి లేకుండా భవనాలు, ఇళ్ల స్థలాలు కొన్న వారికి సబ్​రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. పురపాలక శాఖ మంత్రి ఆదేశానుసారం, మున్సిపల్​ కమిషనర్ల లేఖల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు.

అక్రమ లేఔట్లను నిలువరించేందుకు ఇది ఓ మంచి తరుణం అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో అక్రమ లేఔట్ల స్థలాలు, భవనాలకు రిజిస్ట్రేషన్​లు నిలిపివేశారు.

కమిషనర్ల లేఖల ఆధారంగా సబ్​ రిజిస్ట్రార్లు తక్షణమే అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 30 మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. కమిషనర్ల నుంచి లేఖలు అందిన వెంటనే మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు.

దీని వల్ల అక్రమ లేఔట్ల్​లు- అనధికారిక భవన నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు. లేఖలు రాశారు కొత్త మున్సిపల్​ చట్ట ప్రకారం పురపాలక సంఘాల పరిధిలో అనుమతి లేకుండా వేసిన వెంచర్లలో స్థలాలను అనధికారిక భవనాలను రిజిస్ట్రేషన్​ చేయకూడదు.

పక్కాగా నిషేధం అమలు చేయాలి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కూడా ఈ విషయంలో కఠినంగా ఉండమని కమిషనర్లను కోరారు. దానితో కొంతమంది ఫిబ్రవరి 22 నుంచే రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్​ అధికారులకు లేఖలు రాశారు.

'మా పట్టణ పరిధిలో ఫలానా ఏరియాలో అక్రమ లేఔట్ల్ ఉంది. ఫలానా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేశారు. సంబంధిత సర్వే నంబరులో ఇళ్లు, స్థలాలు రిజిస్టర్​ చేయొద్దు' అని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇలా లేఖలు అందుకున్న అనేకమంది సబ్​రిజిస్ట్రార్లు తక్షణం ఆచరణలో పెట్టారు.

కొంతమంది స్థానిక నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నా ఎంతో స్థిరంగా ఉంటున్నారని తెలిసింది. మున్సిపల్​ చట్టంలో ఉన్న విధంగానే తాము వ్యవహరిస్తున్నామని రిజిస్ట్రేషన్​ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఎన్నెన్ని అక్రమ లేఔట్​లో.. రాష్ట్రంలోని అనేక పురపాలక సంఘాల పరిధిలో వందలాది అక్రమ లేఔట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల వేలాదిగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి.

గత నెల వరకు ఈ నిర్మాణాలకు, స్థలాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా ఆగిపోవడం వల్ల అక్రమ లేఔట్లలో ఇళ్లు, స్థలాలను కొన్న వేలాది మంది లబోదిబోమంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments