Publish Date: Fri, 21 Feb 2020 (17:19 IST)
Updated Date: Fri, 21 Feb 2020 (17:21 IST)
సిరిసిల్ల పట్నంలో ఎస్.సి,ఎస్.టీ బాలికల హాస్టలో గత కొద్దీ కాలంగా అక్కడ అమ్మాయిలు మీద జరుగుతున్న లైంగిక దాడులు ఇటీవలే బట్టబయలు ఆయన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపైన ఇప్పటివరకు లోకల్ ఎమ్మేల్యే అక్కడికి వచ్చి సందర్శించింది లేదు.
దీంతో శుక్రవారం టీడీపీ తెలంగాణా శాఖ కరీంనగర్ పార్లిమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఆ బాలికలని పరామర్శించి హాస్టల్ ప్రదేశాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మేల్యే కెటీఆర్ అక్కడకి రావడం జరిగింది. అప్పుడు వారికీ టీడీపీ తరపున ఒక లెటర్ ఇవ్వడంతో పాటు విషయం యొక్క పురోగతి గురించి అడిగినప్పుడు కొంచం అసహనం, నిర్లక్ష్యంతో కూడిన సమాధానం ఇచ్చిన మంత్రి.. ఇది నా నియోజకవర్గం నేను చూసుకుంటాను అని చెప్పేశారు.