Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేసు: కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

Advertiesment
Kalvakuntla Kavitha
MP kavita
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. 
 
తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సందర్భంగా తదనంతరం జరిగిన ఉపఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. 
 
అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేసిన కారణంగా ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. 
 
కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి, వ్యక్తిగత పూచీకత్తు పదివేల రూపాయలు బాండ్ సమర్పించాలని, తిరిగి 19మార్చ్ నాడు హాజరు కావాలని న్యాయమూర్తి  ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తనను తానే కాల్చుకుని ప్రాణత్యాగం చేసిన చంద్రశేఖర ఆజాద్, ఎందుకు?